కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్త చేసిన MRPS నాయకులు


కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్త చేసిన MRPS నాయకులు&మరియుకాంగ్రెస్ నాయకులు * నాగర్ కర్నూలు జిల్లా  అచంపేట్ పట్టణంలో  గత  2 రోజులుగా MRPS వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ని తెలంగాణ ప్రభుత్వం గృహ నిర్బంధం చేయడం తగదని MRPS  జిల్లా ఉపాధ్యక్షులు. అంతటి. మల్లేష్ మాదిగ , MSF జిల్లా ఇన్చార్జి. సౌట.కాశీo మాదిగలు అన్నారు. మహనీయుల జయంతి కార్యక్రమంలో పాల్గొనకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత, బడుగు బలహీన వర్గాలను అవమానించారని దానికి నిరసనగా అచ్చంపేట పట్టణంలోని అంబేత్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ,      నల్ల జేండలతో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని పంజాగుట్ట లో అంబేత్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కొరకు ఈ నెల 27 న  హైదరాబాద్ లో అంబేత్కర్ వాదుల "మహాగర్జన సభ " నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో MSF తాలూక ఇన్చార్జి దున్నలక్మేశ్వర్, తాలూక ఉపాధ్యక్షులు. రాయిఛెట్టి.రాజు, msf నాయకులు.పవన్, రాజు, రాం ప్రసాద్, అనిల్, ఆంజనేయులు,నితిన్, పుళ్ళెష్,అంజి మద్దతుగా అచ్చంపేట్ కాంగ్రెస్ పార్టీ  సోషల్ మీడియా కన్వీనర్ గంట్ల సునీల్ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాజేష్ మీసాల ప్రసాద్.తదితరులు పాల్గొన్నారు.