కెప్టెన్ సేవలు ఆదర్శప్రాయం, కెప్టెన్ లక్ష్మీ కాంతారావు కు ఘన సత్కారం.
కెప్టెన్ సేవలు ఆదర్శప్రాయం.. 

కెప్టెన్ లక్ష్మీ కాంతారావు కు ఘన సత్కారం...   

ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకోవాలి. మానవ విలువల పరిరక్షణ  రాష్ట్ర అధ్యక్షులు సత్యంగౌడ్..      
 రాజ్యసభ సభ్యులు కెప్టెన్ ఓడితేల లక్ష్మీ కాంతారావు గారి ప్రజా సేవలు ఆదర్శప్రాయమని మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రజాకవి రచయిత ఆధ్యాత్మిక గురువు నాగుల సత్యం గౌడ్ పేర్కొన్నారు. పట్టణంలోని హుజరాబాద్ క్లబ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కెప్టెన్ ఓడితల లక్ష్మీకాంతారావు కు విశ్వమానవ కళ్యాణం అనే మానవతా విలువలను పెంపొందించే కవిత జ్ఞాపకను అందజేసి పట్టు శాలువా కప్పి ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యం గౌడ్ మాట్లాడుతూ ... కెప్టెన్ లక్ష్మీకాంతారావు ప్రజాసేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకుని ఎందరో పేద కుటుంబాలకు తన వంతు సహాయం అందించి ప్రజల మనసులో మంచి వ్యక్తిగా చోటుచేసుకున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆదర్శప్రాయం అన్నారు. ప్రజాసేవనే ఊపిరిగా భావించి సేవ దృక్పథమే జీవిత ఆశయంగా  ఎంచుకున్న లక్ష్మికాంతారావు  వ్యక్తిత్వం మొహనీయమన్నారు. ప్రతి ఒక్కరు సమాజసేవలో భాగస్వాములై నవభారత నిర్మాణానికి పునాదిగ నిలవాలన్నారు. దేశ రక్షణలో మనమంతా సిపాయిలమేనని   ఇందుకు ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకొని,దేశ అభివృద్ధి కొరకు పాటుపడాలన్నారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభను కనబర్చిన  ప్రతిభావంతులకు  కెప్టెన్ లక్ష్మీకాంతారావు  మరియు కంకణాల తిరుపతి రెడ్డి గార్ల చేతుల మీదుగా జ్ఞాపికలు, బహుమతులు ప్రధానం చేశారు .ఈ కార్యక్రమంలో క్లబ్బు కార్యదర్శి  పివి శ్రీనివాసరావు,  క్లబ్బు ఇన్చార్జి కంకణాల తిరుపతిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు చందా గాంధీ రామ్ రెడ్డి, విష్ణుదాస్ గోపాల్ రావు, పైలా వెంకట్ రెడ్డి, కేసిరెడ్డి నరసింహారెడ్డి, తోట రాజేంద్ర ప్రసాద్, తోగరు సదానందం, సమ్మయ్య బొల్లు శ్రీనివాస్ ప్రసాద్, కిషన్ రెడ్డి , ముచ్చ నారాయణరెడ్డి, ఎర్రం నారాయణరెడ్డి, కళ్లెపు మోహన్ రావు, మంచి కట్ల వెంకటరాజం ధోని, సాగి, మేకల రాజిరెడ్డి, వి రవీందర్ రావు, ఆడెపు సూర్యం, ముచ్చ నారాయణరెడ్డి, అడ్వకేట్ సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్  శ్రీనివాస్ రెడ్డి  ప్రముఖులు  ఉన్నతాధికారులు క్లబ్బు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.