అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి రాకెట్‌ దాడులు

బగ్దాద్‌ విమానాశ్రయంలో ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీపై అమెరికా డ్రోన్‌లు దాడి చేసి హతమర్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌ ప్రతికార చర్యల్లో భాగంగా ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక క్యాంపులు, రాయబార కార్యాలయంపై పలుమార్లు దాడులు చేసింది. ఇరాక్‌ రాజధాని బగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి రాకెట్‌ దాడులు చోటుచేసుకున్నట్లు భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రీన్‌జోన్‌ ప్రాంతంలో ఉన్న రాయబార కార్యాయం ప్రహారీ గోడను ఐదు రాకెట్లు తాకినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇరాక్‌ గానీ, అమెరికా గానీ ఇంతవరకు ధ్రువీకరించలేదు. ఇరాక్‌లో మరోసారి రాకెట్‌ దాడులు జరిగినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )