కార్తీ " ఖైదీ" సినిమా ల బన్నీ సినిమా అని .........

'అల వైకుం ఠపురములో' తర్వాత బన్నీ సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ వైవిధ్య భరితమైన పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. చిత్తూరులోని శేషాచలం అడవుల్లో గంధపుచెట్లను కొల్లగొట్టే స్మగ్లర్లతో కలిసి పనిచేస్తాడని, లారీ డ్రైవర్‌ అవతారం ఎత్తనున్నాడని ప్రచారం జరుగుతోంది. దాంతో చిత్తూరు కుర్రాడిగా కనిపించేందుకు తన భాష, యాస మారుస్తున్నాడట. మేకోవర్‌ కోసం ప్రత్యేకించి ట్రైనర్‌ని కూడా నియమించుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తనపాత్ర పై అల్లు అర్జున్ ఎంత శ్రద్ధ చూపుతాడో, ఎంత కమిట్‌మెంట్‌తో పని చేస్తాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలోనూ అదేజరగడంలో ఆశ్చర్యం లేదు. పైగా అక్కడున్నది సుకుమార్‌ కనుక నేచురాలిటీ కోసం ఇంకాస్త ఎక్కువ కసరత్తు ఉంటుంది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )