రూ.11,500 కోట్లు పెట్టుబడులతో తెలంగాణాలో రెండు డాటా సెంటర్ల ఏర్పాటు చేయనున్న అమెజాన్


అమెరికాకు చెందిన ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్.కంపెనీ . తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ మేరకు రెండు డేటా కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. పెట్టుబడుల మొత్తం విలువ.. రూ.11,500 కోట్లు కావడం విశేషం.  రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండలం చందనవెల్లి, కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేటలో ఈ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధిత పనులు కూడా సాగుతున్నట్లు సమాచారం. ఇటీవల మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన సందర్భంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు చెందిన ఉన్నతాధికారులతో ఈ విషయాన్ని చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )