హైదరాబాద్ నగరానికి కొత్తగా రానున్న 12 మంది నిపుణులైన ఐపీఎస్‌ అధికారులు

తెలంగాణ జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తోన్న దాదాపు 12 మంది ఐపీఎస్‌ అధికారులను నగరానికి తీసుకురావాలన్న యోచనలో డీజీపీ ఉన్నట్లు సమాచారం. వీరికి గ్రేటర్‌ పరిధిలోని మూడు కమిషనరేట్లలో, ఇతర రాష్ట్రస్థాయి విభాగాల్లో పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘‘రైట్‌ పర్సన్‌ ఎట్‌ రైట్‌ పొజిషన్‌’’ అన్న విధానంలో ఆయన పోస్టింగ్‌లు ఇవ్వనున్నారని సమాచారం. ఎలాంటి పైరవీలకు తావులేకుండా.. పనితీరు ఆధారంగా సరైన స్థానంలో సరైన అధికారికి బాధ్యతలు అప్పజెప్పనున్నారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )