ప్రధాన రోడ్లను 120 అడుగుల మేరకు విస్తరణ చేసే ఆలోచనలో HMDA

హైదరాబాద్ మహా నగరంలోని ప్రధాన రోడ్లను 120 అడుగుల మేరకు  పెంచేందుకు బల్దియా స్థాయీ సంఘం  ఆమోదం తెలిపింది.  ఇక నుంచి కొత్తగా జారీ చేసే భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి రోడ్డును 120 అడుగుల మేరకు వదిలిన తరువాతే నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు. ఇప్పటికే నిర్మించుకున్న భవనాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన ఫిబ్రవరి 6, బుధవారంనాడు  స్థాయీ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన రోడ్లను 120 అడుగుల మేరకు చేయాలన్న పట్టణ ప్రణాళిక విభాగం ప్రతిపాదనను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందులో భాగంగా దాదాపు 20కిపైగా రోడ్ల విస్తరణకు సభ్యులు తీర్మానం చేశారు. దీంతోపాటు కిషన్‌బాగ్‌-జియాగూడ మధ్య మూసీనదిపై బ్రిడ్జిని నిర్మించేందుకు కూడా ఆమోదం తెలిపారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )