చెలరేగుతున్న చైనా కరోనా వైరస్ .. 1310కి చేరిన మృతుల సంఖ్య


చెలరేగుతున్న చైనా కరోనా వైరస్ .  హుబాయ్ ప్రావిన్సులో విష‌పూరిత వైర‌స్ వ‌ల్ల బుధ‌వారం ఒక్క రోజే 242 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌ర్వాత ఇంత ఎక్కువ స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి.  బుధ‌వారం రోజునే కొత్త‌గా సుమారు 15వేల క‌రోనా కేసులు కూడా న‌మోదు అయ్యాయి. హుబేయ్ కేంద్రంగా విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్‌కు .. డ‌బ్ల్యూహెచ్‌వో తాజాగా కోవిద్‌-19 అని పేరు పెట్టిన విష‌యం తెలిసిందే.  దేశ‌వ్యాప్తంగా సుమారు 60 వేల కోవిద్‌-19 కేసులు న‌మోదు అయిన‌ట్లు ఇవాళ వెల్ల‌డించారు.  క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగా 1310కి చేరుకున్న‌ది.  క‌రోనా వైర‌స్ బారిన ప‌డి.. ఆ త‌ర్వాత కోలుకున్న వారి సంఖ్య 3441కి చేరుకున్న‌ది.  ప్ర‌స్తుతం సుమారు 34 వేల మంది కోవిద్-19 వ్యాధికి చికిత్స పొందుతున్న‌ట్లు చైనా వార్త సంస్థ‌లు వెల్ల‌డిస్తున్నాయి. 
దేశంలో న‌మోదైన‌ కోవిద్‌-19 కేసుల్లో.. హుబేయ్‌లోనే 80 శాతం ఉన్నాయి. క్లినిక‌ల్‌గా నిర్ధారించిన కేసులు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. వ్యాధి వ‌ల్ల క‌లిగే ల‌క్ష‌ణాల ఆధారంగా కోవిద్‌-19 ఉన్న‌ట్లు గుర్తిస్తున్నారు.  ఇన్‌ఫెక్ష‌న్‌కు గురైన ఊపిరితిత్తుల‌ను సీటీ స్కాన్ ద్వారా కూడా ప‌సిక‌డుతున్నారు.  హుబేయ్‌లో ఒక్క రోజు 242 మ‌ర‌ణించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.  దాంట్లో 135 కేసుల‌ను క్లినిక‌ల్‌గా గుర్తించారు.  మిగితా 107 మందికి కూడా కొత్త వైర‌స్ సోకిన‌ట్లు అనుమానిస్తున్నారు. కేవ‌లం హుబేయ్ ప్రావిన్సులోనే 48 వేల ఇన్‌ఫెక్ష‌న్ కేసుల‌ను డాక్ట‌ర్లు గుర్తించారు. మ‌రోవైపు సుమారు 2 వేల మంది ప్ర‌యాణికుల‌తో ఉన్న ఓ భారీ నౌక‌ను కాంబోడియా తీరం వ‌ద్ద నిలిపేశారు.  ఆ నౌక‌లో క‌రోనా వైర‌స్ సోకిన వారుంటార‌న్న భ‌యంతో దాన్ని అక్క‌డే ఆపేశారు. జ‌పాన్‌, తైవాన్‌, గువామ్‌, పిలిప్సీన్స్‌, థాయిలాండ్ దేశాలు ఆ నౌక‌ను త‌మ తీరాల‌కు తీసుకువ‌చ్చేందుకు నిరాక‌రించాయి. 



( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )