నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ హైవేపై బుధవారం ఉదయం ఘోర ఆక్సిడెంట్ : 15 మందికి తీవ్ర గాయాలు


నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ హైవేపై బుధవారం ఉదయం  ఘోర ఆక్సిడెంట్ జరిగింది.  ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి దేవరకొండకు వెళ్తుండగా చిలకమర్రి స్టేజ్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు కాళ్లు విరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఆర్టీసీ బస్సును, లారీ ఢీకొన్న ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )