ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో విషవాయువులు పీల్చుకొని15 మంది విద్యార్థుల అస్వస్థత


 రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో గురువారం మధ్యాహ్నం విషవాయువులు పీల్చుకొని 15 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు కూడా అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ వసతి గృహంలో  వాంతులు, విరోచనాలు, తలనొప్పితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. బాధిత విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఏదో విషవాయువు వచ్చిందని హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. మండల విద్యాధికారికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. చికిత్స అనంతరం విద్యార్థుల ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. 15 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు కూడా అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. విషవాయువులు వ్యాపించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )