ఈ సారి బడ్జెట్ లో రుణమాఫీకి రూ.18వేల కోట్లు... ఇరిగేషన్‌కు రూ.20 వేల కోట్లు


తెలంగాణ : 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1.46 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్‌ ప్రతిపాదించింది. ఈసారి బడ్జెట్  8 శాతం వృద్ధి అంచనాతో 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1.55 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌ను ప్రతిపాదించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలుఅంచనా వేస్తున్నాయి . ఇందులో వ్యవసాయ పారుదల శాఖ కి రూ. 20 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ. 6 వేల కోట్లకుపైగా కేటాయింపులు చూపినా అప్పులతో కలిపి ఈ ఏడాది డిసెంబర్‌ వరకు రూ. 18 వేల కోట్ల వరకు ఖర్చయింది. ఈ అంచనాల నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా రూ. 20 వేల కోట్ల వరకు వ్యయం అవసరమవుతుందని సాగునీటి శాఖ వర్గాలంటున్నాయి.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )