ఏప్రిల్‌ 2 నుంచి 141 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలలో టీఎస్‌–బీపాస్‌ను అమలు : మంత్రి కేటీర్

తెలంగాణ  రాష్ట్రంలో  ఏప్రిల్‌ 2 నుంచి 141 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలతో పాటు ఆరు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో టీఎస్‌–బీపాస్‌ను అమలుచేస్తామని మంత్రి కేటీర్ తెలియచేసారు . టీఎస్‌–ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు 35 రకాల అనుమతులను వేగంగా జారీ చేస్తున్నామన్నారు. భవన నిర్మాణాలకు అగ్నిమాపక, విద్యుత్, ట్రాఫిక్, టౌన్‌ ప్లానింగ్‌ శాఖల అనుమతులను టీఎస్‌–బీపాస్‌ ద్వారా సింగిల్‌ విండోలో జారీ చేస్తామన్నారు. అనుమతుల జారీలో జాప్యం చేసే అధికారులను బాధ్యు లు చేసి వారిపై జరిమానాలు విధించాలని యోచిస్తున్నామన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందితో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గురువారం కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌–ఐపాస్‌ తరహాలోనే టీఎస్‌–బీపాస్‌ను ప్రభు త్వం తెస్తోందని, దీనికి అమలుకు సమాయత్తం కావాలన్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )