20 లక్షల రేషన్ కార్డులు తొలగించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ లో  ఇరవై లక్షల కార్డుల తొలగించాలనీ ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఈ నెల పదిహేను నుంచి కొత్త బియ్యం కార్డులు పంపిణీ చేసి మార్చి నుంచి వాటి ఆధారంగానే సరుకులు ఇవ్వనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల గుర్తింపునకు నిర్దేశించిన నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని చేపట్టిన సర్వేలో పధ్ధెనిమిది లక్షల మంది తెల్లకార్డు కలిగివుండేందుకు అర్హులు కాదని ఏపీలో క్షేత్ర స్థాయిలో తేల్చారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పుడే వివరాలు బహిర్గతం చేస్తే ఒక్కసారిగా వ్యతిరేకత వస్తుందని అందువల్ల పూర్తిగా వడపోత చేసే వరకూ బయటపెట్టకూడదని ఆ శాఖ భావిస్తోంది.
 ఈ నెల 15 నుంచి కొత్త బియ్యం కార్డులు పంపిణీ చేసి మార్చి నుంచి వీటి ఆధారంగానే సరుకులను అందిస్తారు. వేలి ముద్రల ఆధారంగా సరుకుల పంపిణీ జరుగుతున్నందున కొత్త కార్డులు చేతికి వచ్చినా, రాకపోయినా అర్హుల జాబితాలో పేరు ఉండడమే ప్రధానం కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించిన అర్హుల జాబితాలో పేర్లు లేని రెండు లక్షల కుటుంబాలకు పైగా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాటి పరిశీలన పూర్తి చేసిన తరవాత బియ్యం కార్డులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )