2.5 కిలో గ్రాముల అక్రమ బంగారంను స్వాధీనం చేసుకున్న అధికారులు

హైదరాబాద్ లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం లభించింది. వివరాలలోకి వెళ్తే.. విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు తమ విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా.. జెడ్డా నుంచి వచ్చిన నలుగురు మహిళా ప్రయాణీకుల వద్ద 2.5 కిలో గ్రాముల బంగారం లభించింది. బంగారానికి సంబంధించి ధృవీకరణ పత్రాలు చూపించమని అధికారులు అడిగే సరికి సదరు ప్రయాణీకులు నోరెళ్లబెట్టారు. దీంతో, ఇది అక్రమంగా తరలిస్తున్న బంగారమేనని గ్రహించిన అధికారులు.. బంగారాన్ని  స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలించడానికి గల పూర్వాపరాలను తెలుసుకోవడానికి అధికారులు వారిని విచారిస్తున్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )