పల్లెలకు ప్రతీ నెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల - సీఎం కెసిఆర్కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలి. కలెక్టర్లకు అండగా ఉండేందుకు అడిషనల్‌ కలెక్టర్లను నియమించింది. కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో నమ్మకం ఉంచింది. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు చైర్మన్‌గా వ్యవహింరించేవారు. ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మార్చినం. దీనివల్ల కొంత పని ఒత్తిడి తగ్గుతుంది. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడమే లక్ష్యంగా రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగించాలి. పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచి సంరక్షించాలి. గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలి. పాడుబిడిన పాత బావులను పూడ్చివేయాలి. ఈ పనులన్నీ గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు నిర్వహించాలి. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుతో పాలనా విభాగాలు చిన్నవి అయ్యాయి. ఇది పల్లెలను పనిచేయడానికి ఎంతో సానుకూల అంశం. పల్లెల అభివృద్ధికి నిధుల కొరత సమస్య రాకుండా ప్రతీ నెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నాం. వేరే ఖర్చులు ఆపి గ్రామాలకు నిధులు ఇస్తున్నాం. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )