సిద్దిపేట జిల్లాలో ఏకే 47తో కాల్పులు : కేసుని విచారిస్తున్న పోలీసులు


సిద్దిపేట జిల్లాలో ఏకే 47తో కాల్పులు జరగటం తో రాష్ట్రం అంత ఈ విషయం కలకలం రేపుతోంది. అక్కన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి సదానందం అనే వ్యక్తి గంగరాజు అనే మరో వ్యక్తి లక్ష్యంగా కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ కాల్పుల నుంచి గంగరాజు త్రుటిలో తప్పించుకోగలిగాడు. గంగరాజు కుటుంబసభ్యులంతా ఇంట్లో ఉండగానే సదానందం కాల్పులు జరిపి పారిపోవడం గమనార్హం. మూడు రోజుల క్రితం ఇటుకల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు గంగరాజు ఇంటిని పరిశీలించారు. ఘటనా స్థలంలో రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా గంగరాజు కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తు్న్నారు. అయితే, సదానందానికి ఏకే-47 తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )