తెలంగాణ BJP రాష్ట్ర అధ్యక్షుని రేసులో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియమించే అవకా శం ఉందని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తోపాటు,  ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ ప్రయత్నాల్లో ఉన్నా రు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.. ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అ ధ్యక్ష పదవిని ఎవరికిస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌వైపే జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )