సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ పోలీసులు .. ఇకపై ఆకతాయిల ఆట కట్టే ....

తెలంగాణ పోలీసులు ప్రజల భద్రత, సంరక్షణ విషయం లో పలు రకాల కొత్త నిర్ణయాలు తీసుకొన్నారు . హైదరాబాద్ నగరంలో పలు చోట్ల నిబంధనలకు విరుద్ధం గ రేసింగ్ లకు పలువురు ఆకతాయిలు పాల్పడుతున్నారు . దీని వల్ల  పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి . సాధారణ ప్రజలకు ఇబ్బందికి గురి అవుతున్నారు . నెక్లెస్‌ రోడ్డు, పీవీ ఎలివెటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, ఔటర్‌ రింగురోడ్లపై బడా బాబుల కుర్రాళ్ళు  అధునాతన , ఖరీదైన వాహనతో రేసింగ్లు చేస్తూ ఉన్నారు . కొన్ని సార్లు పోలీసులు పట్టుకున్న ,మళ్ళి ఇవి జారకుండా చూడలేక పోతున్నారు.


ఈ సమస్యని దృష్టిలో ఉంచుకొని పోలీసులు తమ పాత పద్దతికి కొన్ని కూత నిభందనలు జోడించి దీనిని అదుపు చేయాలనీ చూస్తున్నారు . అదెలా అంటే నెక్లెస్‌ రోడ్డు, పీవీ ఎలివెటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, ఔటర్‌ రింగురోడ్లపై సి సి కెమెరా లను పోలీసు శాఖ తో అనుసంధానం చేయనున్నారు . స్పీడోమీటర్స్ ని కూడా జత చేయనున్నారు .

ఇకపై ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంగా వాహనం నడిపిన , రేసింగులకు పాల్పడినట్టు తెలిసిన వారిని కెమెరా సాయంతో ఫొటోలు తీసి వాటితో కేసు బుక్ చేయనున్నారు . ఎవరి పైనైనా పలుమార్లు కేస్ బుక్ అయితే ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయనున్నట్టు పోలీస్ షాక తెలియచేసారు . ఈ నిర్ణయం పై  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కుమార్ కూడా ఆమోదం తెలిపే అవకావం ఉందనీ తెలుస్తుంది . 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )