ఉస్మానియా ఆస్పత్రిలోనూ కరోనా వైరస్ ప్రత్యేక వార్డు

హైదరాబాద్‌లో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రిలోనూ ఓ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌కు సంబంధించి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయగా.. దీనికి అదనంగా ఉస్మానియా ఆస్పత్రిలో స్పెషల్ వార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గాంధీ ఆస్పత్రికి చెందిన నలుగురు వైద్య సిబ్బందిని విధుల్లోంచి సస్పెండ్ చేశారు.ఆదివారం గాంధీ ఆస్పత్రిలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అనుమానిత కేసులపై ఎప్పటికప్పుడు హెల్త్ ప్రొఫైల్స్ అందించాలని కేంద్రం ఆదేశించింది. మరోవైపు.. చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని వెనక్కి రప్పించాలని కుటుంబసభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. కుటుంబ సభ్యులతో రోజూ మాట్లాడుతూనే ఉన్నానని జ్యోతి తెలిపారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )