మూడో రోజు కి చేరిన నిమ్స్‌ కాంట్రాక్టు నర్సులు ఆందోళన


నిమ్స్‌లోకాంట్రాక్టు నర్సులు చేపట్టిన ఆందోళన ఆదివారం మూడో రోజుకు చేరింది. వివిధ విభాగాల హెచ్‌ఓడీలతో కూడిన కోర్‌ కమిటీ చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. వేతనాలు పెంచేంత వరకు రాజీపడే ప్రసక్తే లేదని నర్సులు తేల్చిచెబుతున్నారు. విద్యార్థులకు చెల్లిస్తున్న  విధంగా స్టైపెండ్‌ రూపంలో నామమాత్రంగా వేతనాలు అందజేస్తూ..  యాజమాన్యం తమ శ్రమను దోచుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలను పెంచి, ఎరియర్స్‌ను కూడా చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా జరిపిన కోర్ట్‌ కమిటీ చర్చలు ఫలించలేదు.ఒప్పంద నర్సులకు మద్దతుగా నిమ్స్‌ ఉద్యోగ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నగర శాఖ అధ్యక్షుడు ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు.   నిమ్స్‌ నర్సెస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శులు విజయకుమారి,  పారా మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శిరందాస్‌ శ్రీనివాసులు, తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు రాజ్‌ కుమార్‌లు సైతం ఒప్పంద నర్సులకు సంఘీభావం ప్రకటించారు.  ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )