జమ్మూ కాశ్మీర్ లో పాక్ దుండగుల దాడులు , బలైన అమాయకులుభారత సరిహద్దు వెంబడి పాకిస్తాన్ మాటిమాటికి కాల్పులకు తెగబడుతుంది . ఈ రోజు ఉదయం జమ్మూ కాశ్మీర్‌ కుప్వారాలోని టాంగ్‌ధర్‌ సెక్టార్‌లో పాక్ రేంజర్లు కాల్పులకు పూనుకున్నారు . ఈ కాల్పులను తిప్పి కొట్టే యత్నంలో ఒక సామాన్యుడు బలి అయ్యాడు . మరో ఐదారుగురు మనుషులు గాయాలకు గురైనట్టు అధికారులు వెల్లడించారు . పూర్తి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు . కానీ భారత రక్షణ విభాగం మేము అప్రమత్తంగా ఉన్నామని వివరణ ఇచ్చింది . ఎలాంటి దాడులు అయినా తిప్పి కొడతామని వెల్లడి చేసింది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )