బెంగళూరుతోపాటు చెన్నై, హైదరాబాద్‌, ముంబై నగరాల్లోని పలు ప్రాంతాల్లోనూ వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌లో సమస్యలు


బెంగళూరు నగరంలో వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌కు చెందిన వినియోగదారులు శుక్రవారం నుంచి తీవ్రమైన సిగ్నల్ అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి ఆ నెట్‌వర్క్‌ కవరేజీ అసలు లేదని, కొన్ని ప్రాంతాల్లో అసలు నెట్‌వర్క్‌ పనిచేయడం లేదని చాలా మంది యూజర్లు సోషల్‌ మీడియాలో ఫిర్యాదులు చేశారు. అయితే ఈ విషయం పట్ల స్పందించిన వొడాఫోన్‌ ఐడియా.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఫైబర్‌ కేబుల్స్‌ తెగిపోయినందున ఈ సమస్య ఉత్పన్నమైందని, వీలైనంత త్వరగా నెట్‌వర్క్‌ ఔటేజ్‌ సమస్యను పరిష్కరిస్తామని వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. ఇక బెంగళూరుతోపాటు చెన్నై, హైదరాబాద్‌, ముంబై నగరాల్లోని పలు ప్రాంతాల్లోనూ వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పలువురు వినియోగదారులు ట్విట్టర్‌ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై వొడాఫోన్‌ ఐడియా మళ్లీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )