అదనపు కలెక్టర్లకు రెండో రోజు కొనసాగుతున్న గ్రామీణ, పట్టణాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం అదనపు కలెక్టర్లకు రెండో రోజు కొనసాగుతుంది. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో అదనపు కలెక్టర్లకు శిక్షణ కొనసాగుతుంది. నేటి కార్యక్రమంలో భాగంగా పురపాలక చట్టంపై అదనపు కలెక్టర్లకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొననున్నారు. ప్రభుత్వ ఆలోచనలు, ప్రాధాన్యాలను మంత్రి వివరించనున్నారు. అదేవిధంగా ఇవాళ్టి అవగాహన కార్యక్రమంలో కలెక్టర్లు పాల్గొననున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )