ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు కుమారుడి వివాహానికి హాజరైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం (ఫిబ్రవరి 12) ఉదయం అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చంద్రబాబు వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం అమరావతి నుంచి ఖమ్మం బయల్దేరి వెళ్లారు. దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమరావతి పరిరక్షణ ఉద్యమం పట్ల ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రజా చైతన్య యాత్ర చేపట్టనున్న టీడీపీ అధినేతకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ, గొల్లపూడి, కొండపల్లి మీదుగా తిరువూరు చేరుకున్న చంద్రబాబు నాయుడుకి స్థానిక ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. అటు మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా మంగళగిరిలో జరిగిన రెండు వివాహ కార్యక్రమాల్లో తళుక్కుమన్నారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )