భారతదేశ ప్రతిష్టాత్మక 'ఆర్ఆర్ఆర్' చిత్రం రిలీస్ వాయిదా .,,,

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. తాజాగా ఈ చిత్రబృందం నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. చిత్ర విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు తెలిపిన 'ఆర్ఆర్ఆర్' యూనిట్, మరో ట్వీట్ లో కొత్త తేదీని ప్రకటించింది. వాస్తవానికి 'ఆర్ఆర్ఆర్' చిత్రం 2020 జూలై 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, వచ్చే ఏడాది జనవరి 8న తమ చిత్రం విడుదల అవుతుందని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంత సుదీర్ఘ సమయం పాటు వేచి ఉండడం కష్టమే అయినా, ఎప్పటికప్పుడు చిత్ర సంగతులు పంచుకుంటామని ఓ ట్వీట్ లో తెలిపింది. అత్యుత్తమ స్థాయిలో సినిమా రూపొందించాలంటే సమయం పడుతుందని, అభిమానుల నిరాశను తాము అర్థం చేసుకోగలమని చిత్రబృందం పేర్కొంది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )