తెలుగు లో ఎంట్రీ కి తెగ ప్రయత్నిస్తున్న హిందీ స్టార్ హీరోయిన్స్తెలుగు సినిమా అనగానే హిందీ హీరోయిన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు . గత ఇరవై సంవత్సరాల నుండి  ఎంతో  మంది హీరోయిన్స్ తెలుగు లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు .

ఇందులో కత్రినా కైఫ్ , ప్రీతి జింటా , శిల్ప  శెట్టి , రవీనా టాండన్ , టబు ,  కంగనా రనౌత్  పలువురు ఉన్నారు . ఇటీవల కాలంలో నేహా శర్మ , వాణి కపూర్ , యామి గౌతమ్ , దిశా పటాని , కియారా అద్వానీ , అలియా భట్ లు ఉన్నారు .


వీరే కాక తెలుగు అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ , సారా అలీ ఖాన్ , భూమి పెడ్నేకర్ లు తెలుగు లో ఎంట్రీ కి రంగం సిద్ధం చేసుకుంటున్నారు . త్వరలో జాహ్నవి కపూర్ తెలుగులో అరంగేట్రం చేయనుందని తెలుస్తుంది .( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )