ఐదుగురు కొత్త సమాచార హక్కు చట్టం కమిషనర్లు ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కొత్తగా ఐదుగురిని తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది . ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు..ఈ రెండింటిలో ఏది ముందు వస్తే అప్పటి వరకు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు.  నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, టీ–న్యూస్‌ సీఈఓ మైదా నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత డాక్టర్‌ గుగులోతు శంకర్‌నాయక్, న్యాయవాదులు మహమ్మద్‌ అమీర్‌ హుస్సేన్, సయ్యద్‌ ఖలీలుల్లా సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు మరో కమిషనర్‌ పనిచేస్తున్నారు. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )