మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా

GHMC అధికారులు  మంత్రి అయినా సరే నిబంధనలు పాటించకుంటే వదిలేది లేదు అని ఫైన్ వేశారు . హైదరాబాదులో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి తలసాని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ కొరడా ఝులిపించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. అనుమతి లేకుండా కొన్నిచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ అధికారులు మంత్రికి ఫైన్ వేశారు. రూ.5 వేలు చెల్లించాలంటూ తలసానికి నోటీసులు పంపారు. మరోవైపు మంత్రి తలసాని ఇవాళ నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో కేసీఆర్ లోగోను ఆవిష్కరించారు. సోమవారం రోజున సీఎం కేసీఆర్ జన్మదినం కావడంతో జలవిహార్‌లో వేడుకలు నిర్వహించనున్నారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )