తెలంగాణ లో కొత్తగా రానున్న ప్రైవేట్ యూనివర్సిటీ లు : అనుమతులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంస్థలు ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూ ధ్రువపత్రాలను  గురువారం జారీ చేసింది. మల్లారెడ్డి మహిళా వర్సిటీని మైసమ్మగూడలో ఏర్పాటు చేసేందుకు ఓకే చెబుతూ ఎల్‌వోఐ జారీ చేసింది. ఈ మేరకు మల్లారెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి సీహెచ్‌ మహేందర్‌రెడ్డికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామంద్రన్‌ ఉత్తర్వులిచ్చారు. ఈ ఎల్‌వోఐ ఆధారంగా ఆ విద్యా సంస్థ వర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. రూ.10 కోట్ల కార్పస్‌ ఫండ్, మూడేళ్ల పాటు ఉండేలా రూ.30 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్, ప్రాజెక్టు విలువలో 1% ఎండోమెంట్‌ ఫండ్‌ లేదా రూ.10 కోట్లు వెచ్చించడంతోపాటు తగిన భవనాలు, వాటిల్లో సదుపాయాలు ఏర్పా టు చేయాల్సి ఉంటుంది. ఆరు నెలల్లోగా అవి పూర్తి చేశాక ప్రభుత్వం లెటర్‌ ఆఫ్‌ అప్రూవల్‌ను జారీ చేయనుంది. మల్లారెడ్డి మహిళా వర్సిటీతోపాటు టెక్‌ మహీంద్రా వర్సిటీ ఏర్పాటుకు కూడా ఎల్‌వోఐ ఇచ్చింది. వచ్చే వారం రోజుల్లోగా   అనురాగ్, గురునానక్‌ , శ్రీనిధి, ఎంఎన్‌ఆర్, నిప్‌మర్, వోక్సన్, ఎస్‌ఆర్‌ విద్యాసంస్థలకు ఎల్‌వోఐ జారీ చేసే అవకాశం ఉంది.న్నాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )