హైదరాబాద్ లో విజృభిస్తున్న స్వైన్ ఫ్లూ :


హైదరాబాద్ లో విజృభిస్తున్న స్వైన్ ఫ్లూ . సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో శనివారం కొత్తగా 5 స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీకి చెం దిన ఓ వృద్ధురాలు (64), నల్లగొండ జిల్లా త్రిపురారం గ్రామానికి చెందిన వృద్ధుడు(60), చాంద్రాయణగుట్టకు చెందిన వృద్ధురాలు(68), మహబూబ్‌నగర్‌ జిల్లా హేండ్‌వాడకు చెందిన వ్యక్తి (35), ఫతేనగర్‌కు చెందిన నెలన్నర వయసు గల పాపకు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ వచ్చింది. మరో ముగ్గురు స్వైన్‌ఫ్లూ అనుమానితులకు గాంధీ ఆస్పత్రి డిజాస్టర్, పీఐసీయులో అడ్మిట్‌ చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )