షి సేఫ్ నైట్ వాక్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులు


షి సేఫ్ నైట్ వాక్ పేరుతో హైదరాబాద్ శివార్లలోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం సాయంత్రం 8 గంటలకు ఈ కార్యక్రమం ఆరంభం కానుంది.  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అధికారులు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఓ విభాగం ఇది. మహిళలు, చిన్నపిల్లల భద్రత కోసం ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. షి సేఫ్ నైట్ వాక్ ఈవెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రముఖలు భాగస్వామ్యులు కానున్నారు.కొన్ని గంటలపాటు వారు నడకను కొనసాగిస్తారు. మహిళలు, చిన్నపిల్లలకు అండగా తాము ఉన్నామనే భరోసాను ఇవ్వనున్నారు. రాత్రివేళల్లో కూడా మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగే వాతావరణాన్ని, పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )