నల్లమల అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు : రెండు కిలోమీటర్ల మేరకు మంటలు


నల్లమల అటవీ ప్రాంతంలో ఈ రోజు కార్చిచ్చు చెలరేగింది . ఈ మంటలు సుమారు రెండు కిలో మీటర్ల మేర వ్యాపించినట్లు తెలుస్తుంది . ఈ కార్చిచ్చు నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ సమీపంలో సంభవించినట్లు తెలుస్తుంది . ఈ మంటలను చుసిన స్థానికులు అగ్ని మాపక దళాలకు సమాచారం అందించగా ఆలా ఈ వార్త వెలుగులోకి వచ్చింది . ఈ కార్చిచ్చు కి కారణాలు ఏంటో త్వరలోనే తెలుసుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలియచేసారు .( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )