యువ మహిళా కలెక్టర్ల నియామకం : రాష్ట్ర ప్రగతే లక్ష్యం


తెలంగాణ రాష్ట్రం అవతరించైనా తర్వాత ప్రభుత్వ పాలనలో భారీ స్థాయిలో మార్పు తీసుకు వచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుంది . ఒకే సారి 21 జిల్లాల కు కొత్త కలెక్టర్ల ను నియమించి రికార్డ్ నెలకోల్పారు . ఈ సారి మహిళా యువశక్తి కి బహు ప్రాధాన్యం ఇచ్చారు . ఈ సారి నియమించిన కలెక్టర్ లలో యువకుల శాతం ఎక్కువగా ఉంది . ముందు చూపుతో కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పలువురు పెద్దలు పేర్కొన్నారు . అదే విధంగా యువ మహిళా కలెక్టర్ల నియామకం కూడా రాష్ట్రానికి శుభ పరిణామం అని పలువురు పెద్దలు సీఎం కెసిఆర్ నిర్ణయాన్ని ప్రశంశిస్తున్నారు . ఈసారి 21 మంది లో 8 మంది యువ మహిళా కలెక్టర్ లే ఉన్నారు . వారు


1. పాసమి బసు, కలెక్టర్ (వికారాబాద్‌)
2. దేవసేన (ఆదిలాబాద్‌)
3. హరిచందన (నారాయణ్‌పేట)
4. శ్వేతా మహంతి (హైదరాబాద్‌)
5. శృతి ఓఝూ (జోగులాంబ గద్వాల)
6. సిక్తా పట్నయక్ (పెద్దపల్లి)
7. కె. నిఖిల (జనగామ)
8. షేక్‌ యాస్మిన్‌ బాషా (వనపర్తి)( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )