నెరవేరిన నిజామాబాద్ రైతుల కల : పసుపు బోర్డుకు అనుమతిస్తూ పార్లమెంటు లో ప్రకటన

నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ ఈ నాటికి నెరవేరింది . ఇన్నేళ్లకు కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది . ఈరోజు జరిగిన బడ్జెట్ సమావేశం లో నిజామాబాద్ పసుపు బోర్డు కు నిధులు విడుదల చేస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేసారు . నిజమాబాద్ కేంద్రంగా  స్పైస్ ప్రాంతీయ బోర్డు అని బడ్జెట్ కి నిధుల విడుదల జరిగింది . ఇది పసుపుకు కాకా ఇతర ధాన్యాలకు వాడుకునేలా దీనికి  స్పైస్ ప్రాంతీయ బోర్డు అనే పేరుతో నిధుల మంజూరు జరిగినట్లు తెలుస్తుంది . 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )