కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ని కలిసిన తెలంగాణ ఎంపీలు

మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని పలు సమస్యలపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో లోక్‌సభ సభ్యులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు సమావేశమయ్యారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత నేటి వరకు ఒక్క జవహర్ నవోదయ విద్యాలయాన్ని కూడా మంజూరీ చేయలేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ కు మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తొలి ప్రాధాన్యంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో జె.ఎన్.వి. ఏర్పాటు చేయాలని కోరారు. వెనకబడిన ప్రాంతాలపై కేంద్రం వెంటనే దృష్టి సారించాలని వినతిపత్రం సమర్పించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )