రేపే జరుగనున్న తెలంగాణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు



తెలంగాణ రాష్ట్రంలో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 747 పీఏసీఎస్‌ల పరిధిలోని 6,248 మంది డైరెక్టర్‌ పోస్టులకు ఈ నెల 15న (శనివారం) ఎన్నికలు నిర్వహించేందుకు సహకారశాఖ ఎన్నికల అథారిటీ అన్నిరకాల ఏర్పాట్లుచేసింది. ఎన్నికల నిర్వహణకు 747 మంది గెజిటెడ్‌ అధికారులను ఎన్నికల అధికారులుగా, మరో 20 వేలకుపైగా సిబ్బందిని నియమించారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్‌ పత్రాలను ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు అందుబాటులో ఉండేలా సరఫరాచేశారు. సుమారు 12 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరుగనున్నది. మధ్యాహ్నం రెండు నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి.. సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. పాలకవర్గాల నియామకాలను ఎన్నికల ముగిసిన మూడురోజుల్లో చేపట్టనున్నట్టు ఎన్నికల అథారిటీ అధికారులు చెప్పారు. పాలవర్గాల ఎన్నికల సందర్భంగా ఏదైనా సమస్యలు తలెత్తితే కో ఆపరేటివ్‌ చట్టాల ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )