హైదరాబాద్ లో పురాతన భవనాల కూల్చివేత


 హైదరాబాద్ లో పురాతన భవనాల  కూల్చివేత ప్రక్రియ మొదలైంది . ఇందులో భాగంగా  స్టోన్ బిల్డింగ్ గా పిలవబడే ఈ చారిత్రాత్మక కట్టడం నేలమట్టం కానుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సెక్రెటేరియట్ కు వాస్తు సమస్య ఉన్న కారణంగా తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం టిఎస్ఎస్పిడిసిఎల్ కు సంబంధించిన కార్యాలయాలు ఈ భవనంలో ఉన్నాయి, అయితే ఈ నిర్మాణం1910లో నిజాం పాలనలో పూర్తిగా రాతితో నిర్మింపబడింది. సెక్రటేరియట్ అవుట్ గేట్ పక్కనే మింట్ కాంపౌండ్‌లో ఈ భవనం ఉంది. రాతి కట్టడమైన ఈ భవనానికి చాలా చరిత్ర ఉంది. దక్షిణాసియాలోనే తొలిసారిగా హైదరాబాద్‌ రాష్ట్రంలో నిర్మించిన తొలి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఈ భవనంలోనే ఉండేది. ఉస్మానియా టెక్నికల్‌ కాలేజ్‌ కూడా కొన్నాళ్లపాటు ఈ భవనంలోనే కొనసాగింది. ప్రస్తుతం ఉన్న టిఎస్ఎస్పిడిసిఎల్ సంబంధిత కార్యాలయాలను వెంటనే ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. మరోవైపు, నిర్మించి వందేళ్లు అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న ఈ భవనాన్ని కూల్చడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )