మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ కి ఎదురైన ఊహించని సంఘటన


మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో  మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఓ సన్నిహితుడి వివాహానికి హాజరయ్యారు. అక్కడ మంత్రిని కలిసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. గుంపులుగా అందరూ ఆయన చుట్టూ చేరారు. ఈ క్రమంలో చేతి కడియాన్ని ఎవరో దొంగిలించారు. ఈ బంగారు కడియం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఎంతో సెంటిమెంట్ అని ఆయన అనుచరులు చెప్తున్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులను, వ్యక్తిగత సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేమైనా చేయండి.. ఏం చేస్తారో నాకనవసరం.. ఆ కడియం కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. బిత్తరపోయిన పోలీసులు ‘ఎవరైనా తీసుంటే ఇచ్చేయండి, చోరీ చేసిన వారిని ఏమీ అనం అంటూ అక్కడున్నవారిని బతిమాలుకున్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )