ఉపరితల ఆవర్తణ ద్రోణితో తెలంగాణ పలు జిల్లాలలో వర్షాలు పడే అవకాశం : హైదరాబాద్ వాతావరణ కేంద్రం


ఉపరితల ఆవర్తణ ద్రోణితో తెలంగాణ  పలు జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.  రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు . తమిళనాడు నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు  ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిదని ,  ప్రస్తుతం మహారాష్ట్ర పరిధిలోని మరాఠ్వాడాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆది, సోమవారాలు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి తెలంగాణ దిశగా తేమగాలులు వీస్తున్నాయన్నారు. ప్రజలు  అప్రమత్తం గా ఉండాలని వెల్లడించారు . 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )