తెలంగాణాకి దక్కని కొత్త రైల్వే లైన్లు ...


తాజా బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వేకు రూ.6,846 కోట్లను కేటాయించారు. . ప్రారంభమైన లైన్లు పూర్తి చేశాకే కొత్తవి మొదలుపెట్టాలన్న ప్రధాని మోదీ ఆలోచన బడ్జెట్‌లో స్పష్టంగా కనిపించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులతో సరిపెట్టింది. తాజా బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వే జోన్‌కు కేటాయింపుల వివరాలను బుధవారం జీఎం గజానన్‌ మాల్యా రైల్‌ నిలయంలో మీడియాకు వెల్లడించారు.ఇది గత ఏడాది కంటే రూ.922 కోట్లు ఎక్కువ ,  ఈ కేటాయింపులో 

  1. మనోహరాబాద్‌–కొత్తపల్లి: రూ.235 కోట్లు.. 
  2. మునీరాబాద్‌–మహబూబ్‌నగర్‌:  రూ.240 కోట్లు 
  3. భద్రాచలం–సత్తుపల్లి:  రూ.520 కోట్లు 
  4. ఎంఎంటీఎస్‌కు రూ.40 కోట్లు...
  5. కాజీపేట–బల్లార్షా మూడోలైన్‌కు తాజా బడ్జెట్‌లో ఏకంగా రూ.483 కోట్లు
  6.  కాజీపేట–విజయవాడ మూడో లైన్‌ పనులకోసం రూ.404 కోట్లు
  7. సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్‌ మధ్య 85 కి.మీ. మేర డబ్లింగ్‌ పనులకు గాను రూ.185 కోట్లు
చర్లపల్లి–శ్రీకాకుళం, చర్లపల్లి–వారణాసి, చర్లపల్లి–పన్వేల్, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్‌–గౌహతి, చర్లపల్లి–చెన్నై, చర్లపల్లి–షాలిమార్, విజయవాడ–విశాఖ, తిరుపతి–విశాఖ తదితర ప్రాంతాల మధ్య ప్రైవేట్‌ రైళ్లు ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )