కొత్త సమస్యతో సతమతమవుతున్న పోలీసులు

 ప్రపంచం అంత కరోనా వైరస్ తో గజ గజ వణికిపోతుంది . అతి వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి ఇది . అతి భయంకరమైన వైరస్ ఇది . దీనికి నిర్ములనకు మందు లేదు . ప్రపంచం లోని పెద్ద పెద్ద సంస్థలు దీనికి విరుగుడు ను  తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి . 

ఇది ఇలా ఉంటె భారత్ లో పలు పలు నగరాలలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రజలలో భయం మొదలవుతుంది . అంతే కాకుండా ఈ వైరస్ చాల సులభంగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది . ఈ మధ్య పోలీసులు నిర్వహించే "డ్రంక్ అండ్ డ్రైవ్ " పరీక్షలు వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనే ఉహాగానాల వాళ్ళ ఈ ప్రజలు ఈ పరీక్షలను వ్యతిరేకిస్తున్నారు .  


అసలు సమస్య ఏంటంటే "బ్రీథ్ అనలైజర్ " తో పరీక్షలు చేసేప్పుడు వాడే పరికరం , మరల మరొకరికి వాడటం ఇలా చేయటం వల్ల ఎవరికైనా ఈ వైరస్ ఉంటె మరొకరికి వ్యాప్తి చెందుతుంది అనే ఊహాగానాల వాళ్ళ ఈ సమస్య పోలీసులు , అధికారులకు పేద్ద సమస్య అయింది .  కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్ని నిలిపివేయాల్సిందిగా కోరుతూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు వ్రాయటం జరిగింది . ప్రభుత్వం మాత్రం ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు . ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )