కొత్త సంస్కరణల వైపుగా సీఎం కెసిఆర్ ముందడుగులు : కొత్తగా రెండు రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు


తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో చాల మార్పులే జరిగాయి . అందులో ముఖ్యంగా జిల్లా ల విభజన , జోన్ ల విభజన , రెవిన్యూ డివిజన్ల పెంపు .. ఇంకా చాలానే ఉన్నాయి . ఈ సారి మళ్ళి రెవిన్యూ డివిజన్ల పెంపు జరిగింది . ఈ సారి వేములవాడ(రాజన్న సిరిసిల్ల జిల్లా ) , జోగిపేట (మెదక్ జిల్లా ) లు రెవిన్యూ డివిజన్ల పెంపు లో ఉన్నాయి . వేములవాడలో గల వేములవాడ పట్టణ , వేములవాడ గ్రామీణ మండలం , సమీపంలో ఉన్న చందుర్తి మండలం , బోయినపల్లి మండలం , కోనరావుపేట , రుద్రంగి మండలాలున్నాయి.  అదే విధంగా జోగిపేటలో  అందోల్, పుల్కల్, వట్పల్లి మండలాలు , మరికొన్ని గ్రామాల హెచ్చు తగ్గింపు  లు ఉండబోతున్నట్లు తెలుస్తుంది . కానీ పూర్తి సమాచారం త్వరలో వెలుబడనుంది . 


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )