వరంగల్‌,ఆదిలాబాద్,కొత్తగూడెం,నిజామాబాద్‌,పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌ లో విమానాశ్రయాలు

భారత దేశవ్యాప్తంగా వచ్చే నాలుగేళ్లలో వంద ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొంది. వరంగల్‌ ఆదిలాబాద్, కొత్తగూడెం,నిజామాబాద్‌, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌ లో  ఎయిర్‌పోర్టుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధ్యయనం చేస్తోంది.హైదరాబాద్‌ బయట వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఐటీ క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటవుతున్న ఐటీ క్లస్టర్లతో పాటు, ఫార్మాసిటీ వంటి భారీ పారిశ్రామికవాడల్లో హెలిపోర్టుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ హెలీపోర్టుల ద్వారా రాష్ట్రంలో టెంపుల్‌ టూరిజం కూడా అభివృద్ధి చెందడంతో పాటు, పారిశ్రామిక పెట్టుబడులకు కూడా ఊతం లభిస్తుందనే అంచనా వేస్తోంది. వీటి ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు నిధులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )