దేశంలో తెలంగాణ పోలీస్‌శాఖ నెంబర్‌ వన్‌ : హోంమంత్రి మహమూద్‌ అలీబేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ లోగోను హోంమంత్రి ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ పోలీస్‌శాఖ నెంబర్‌ వన్‌ అన్నారు. పోలీస్‌శాఖను రూ.700 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీస్‌తో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. జైళ్లలో ఖైదీల సంఖ్య సైతం తగ్గిందన్నారు. నగరంలో, రాష్ట్రంలో గుడుంబా వ్యాపారం కనుమరుగైందన్నారు. షీ టీమ్స్‌, భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పూర్తి కానుందని హోంమంత్రి పేర్కొన్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )