ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇన్కమ్ టాక్స్ శాఖ అధికారులు దాడులు



ఆదిలాబాద్  జిల్లా కేంద్రంలోని ప్రైవేటుహాస్పిటల్స్ పై మంగళవారం ఇన్కమ్ టాక్స్ శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఆ ఇన్కమ్ టాక్స్ శాఖ  అసిస్టెంట్‌ కమిషనర్‌ సంజయ్‌ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. సినిమారోడ్డులోని శ్రీరామ నర్సింగ్‌హోమ్, బస్టాండ్‌ ఎదుట గల శారద నర్సింగ్‌ హోమ్‌లపై దాడులు నిర్వహించారు. అలాగే ఆదిలాబాద్   పట్టణంలోని ప్రధాన కూడళ్లలో గల పలు ప్రైవేట్‌ ఆస్పత్రులపై దాడులు నిర్వహించి రికార్డులు పరిశీలించారు.   


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )