హైదరాబాద్ లో కరోనా వైరస్ ....? చైనాలోని వూహాన్‌ పట్టణ కేంద్రంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా  వైరస్‌ తెలంగాణ రాష్ట్రంలోనూ అలజడిసంచలనం రేపింది .చైనా నుంచి వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు ఈ వైరస్‌ సోకిందని, పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్‌ వచ్చిందన్న వార్తలు ఈ ఆందోళనలను మరింత అధికం చేశాయి. చైనా తదితర దేశాల నుంచి హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు వస్తుండడంతో ఏ క్షణాన ఈ వైరస్‌ ఇక్కడి ప్రజలను కబళిస్తుందోనన్న ఆందోళన ఈ వారమంతా నెలకొంది.  చివరకు వారికి కూడా నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని తేలడంతో ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది.  . 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )