ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్

తెలంగాణ  అసెంబ్లీ లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇవాళ ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు,  పలువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల మాట్లాడుతూ..సీనియర్ శాసనసభ్యులైన గంపగోవర్ధన్ ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమైన విషయం అని అన్నారు . ఈ సందర్భంగా ఆయనకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు . 


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )