సీఏఏపై మద్దతు కోసం మార్చి లో బీజేపీ భారీ బహిరంగసభ

సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం )పై మార్చి మొదటి వారంలో భారీ బహిరంగసభ నిర్వహణకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని మోడీ ను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సభ నిర్వహణపై పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ కసరత్తు చేస్తున్నారు. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడు రఘునందన్‌రావును పార్టీ దూరంగా పెట్టినట్లు తెలిసింది. కేసు తేలేవరకు పార్టీకి దూరంగా ఉండాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )