గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల మధ్య కోల్డ్‌వార్‌ : ఒకవైపు కరోనా , మరో వైపు డాక్టర్ల ....


హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కొన్నిరోజులుగా డాక్టర్ల మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోంది. ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ. గాంధీ ఆస్పత్రిలోకి మీడియాకి అనుమతి లేదంటూ ఇన్‌పేషంట్‌ బ్లాక్‌ నుంచి మీడియా ప్రతినిధులను బయటకు పంపించారు సూపరింటెండెంట్‌ శ్రవణ్‌. మరోవైపు వసంత్‌ ఆరోపణలపై వైద్యశాఖ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. చాలామంది వైద్యులు ఆస్పత్రికి రాకుండానే నెలనెలా జీతాలు తీసుకుంటున్నారని సమాచారం. కొన్ని నెలలపాటు నకిలీ వైద్యుడు వైద్యం అందిస్తున్నా కనిపెట్టలేకపోయారు గాంధీ సూపరింటెండెంట్‌. ఇక తమ తప్పులు ఎక్కడ బయటకు పొక్కుతాయోనని మీడియాపై ఆంక్షలు విధించారు సూపరింటెండెంట్‌ శ్రవణ్‌. డాక్టర్‌ వసంత్‌పై సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. రోగుల నుంచి షాపుల నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు వసంత్‌పై ఆరోపణలు చేశారు శ్రవణ్‌. దీనికి సంబందించిన ఆడియో, వీడియో టేపులను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌ బయటపెట్టారు. డాక్టర్‌ వసంత్‌కు ఓ విద్యార్థికి మధ్య జరిగిన పోన్ సంబాషణను సూపరింటెండెంట్‌ విడుదల చేశారు. వసంత్‌కు మతిస్థిమితం లేదని సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ అన్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )