కొండ పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన స్పీకర్ పద్మారావు గౌడ్ గారు .....సిద్దిపేట జిల్లా:


తాతల కాలం నుండి ప్రతి ఏటా కొండపోచమ్మ తల్లిని దరిశించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు . సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ కొండపోచమ్మ అమ్మవారికి కుటుంబ సమేతంగా స్పీకర్ పద్మారావు గౌడ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . కొమురవేల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కొండపోచమ్మ దేవాలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కొమురవేల్లి మరియు కొండపోచమ్మ ఆలయాలను ప్రతి ఏటా దర్శించుకోవడం తాతల కాలం నుండి ఆనవాయితీ గా వస్తుందని కాబట్టి ప్రతి ఏటా మేము కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దేవాలయల అభివృద్ధి కోసం పాటు పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు రాష్ట్ర  ప్రజలు సుఖ సంతోషాలతో ఎల్లపుడు ఉండాలని అమ్మవారికి మొక్కడం జరిగిందని పద్మారావు గౌడ్ అన్నారు .